'మిర్జాపూర్ 2' యాక్టర్ అనుమానాస్పద మృతి!
on Dec 2, 2021
పాపులర్ వెబ్ సిరీస్ 'మిర్జాపూర్ 2సలో విలన్ మున్నా భయ్యా ఫ్రెండ్ లలిత్ పాత్రను పోషించిన బ్రహ్మ మిశ్రా మృతి చెందాడు. అందిన సమాచారం ప్రకారం, నవంబర్ 29న ఛాతీ నొప్పితో బాధపడిన అతను ఒక డాక్టర్‌కు చూపించుకున్నాడు. ఆ డాక్టర్ గ్యాస్ ప్రాబ్లమ్‌కు మెడిసిన్ ఇచ్చాడు. అది తీసుకొని ఇంటికి వచ్చాడు మిశ్రా. ఆ తర్వాత అతను ఇంట్లో చనిపోయి కనిపించాడు. ముంబై వర్సోవాలోని అతని ఫ్లాట్‌లో దుర్గంధం వెదజల్లుతున్న అతని మృతదేహాన్ని ఈరోజు (డిసెంబర్ 2) పోలీసులు కనుగొన్నారు. బాడీని అటాప్సీ నిమిత్తం డాక్టర్ కూపర్ హాస్పిటల్‌కు తరలించారు.
'మిర్జాపూర్ 2'లో మున్నా భయ్యాగా నటించిన దివ్యేందు ఈ దుర్వార్తను ధ్రువీకరించాడు. బ్రహ్మ మిశ్రాతో దిగిన ఒక సెల్ఫీ ఫొటోను షేర్ చేసిన దివ్యేందు, "రిప్ బ్రహ్మ మిశ్రా. మన లలిత్ ఇక లేడు. అందరూ అతని కోసం ప్రార్థించండి" అని రాసుకొచ్చాడు.
Also read: ఆర్థిక నేరగాడు సుఖేశ్ బుగ్గపై జాక్వలిన్ ముద్దు.. బయటకొచ్చిన మిర్రర్ సెల్ఫీ!
'మాంఝీ: ద మౌంటెన్ మ్యాన్', 'దంగల్', 'కేసరి', వెబ్ సిరీస్ 'మిర్జాపూర్ 2'లలో చేసిన పాత్రలతో బ్రహ్మ మంచి పేరు తెచ్చుకున్నాడు. అటాప్సీ రిపోర్ట్ వచ్చాక అతని మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావచ్చు.
Also Read